Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రాధా కృష్ణ నిర్మాణంలో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతుంది. చాలా సంవత్సరాలుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. ఈ సంవత్సరంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇటీవలే ‘జైలవకుశ’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. భారీ అంచనాలున్న కారణంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని త్రివిక్రమ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్‌కు సరి జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావించాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రద్దా కపూర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించలేనని చెప్పడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు మహేష్‌బాబు దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈమె ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లను కూడా మెప్పించింది. త్వరలోనే హీరోయిన్ పూజా హెగ్డే అంటూ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ మరి కొన్ని రోజుల్లో పట్టాలెక్కించబోతున్నారు.