ధనుష్‌పై పడ్డ డిస్ట్రిబ్యూటర్లు

kaala movie distributors targets on dhanush

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వరుస చిత్రాలు చేస్తున్న ధనుష్‌ ఇటీవలే తన మామ రజినీకాంత్‌తో ‘కాలా’ అనే చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రికార్డు స్థాయిలో జరిగింది. దాంతో సినిమా వల్ల ధనుష్‌కు దాదాపు 100 కోట్ల లాభం వచ్చినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. సినిమా విడుదలై సూపర్‌ హిట్‌ అయితే మరో 50 నుండి 75 కోట్ల వరకు లాభం రావడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని సినిమా ఫలితం తారు మారు అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని విధంగా సినిమా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. కబాలి సినిమా కొనుగోలు చేసి నష్టపోయిన వారే ఈ చిత్రాన్ని కూడా కొనుగోలు చేశారు. దాంతో వారు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో వారు నిర్మాత ధనుష్‌ వెంట పడుతున్నారు.

తమిళనాడుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మరీ దారుణంగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌ రన్‌లో కనీసం 5 కోట్లను కూడా ఈ చిత్రం రాబట్టలేక పోయిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పాయి. కాని కొన్ని ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు. దాంతో అంతా కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా నిర్మాత ధనుష్‌ వద్ద మొర పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ధనుష్‌ ఏం చేస్తాడు అనేది చూడాలి. గతంలో రజినీకాంత్‌ నటించిన సినిమాలు ఫ్లాప్‌ అయితే నిర్మాతలు కొంత మొత్తం అయినా డిస్ట్రిబ్యూటర్లకు సాయంగా అందించారు. కాని ఈసారి రజినీకాంత్‌ అల్లుడు నిర్మాత అవ్వడం వల్ల ఆయన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటాడా లేదా అనేది చూడాలి.