Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కాబాలి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కబాలిలో రజినీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన విషయం తెల్సిందే. ‘భాష’ రేంజ్లో ఉంటుందని అంతా భావించారు. కాని అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దర్శకుడు రంజిత్ పాకు వచ్చిన సూపర్‌స్టార్ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు అంటూ అంతా కూడా ఆయన్ను విమర్శించారు. ‘కబాలి’ చిత్రం తర్వాత వెంటనే రంజిత్ పాతో చిత్రం చేసేందుకు రజినీకాంత్ ఓకే చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. డిజాస్టర్ ఇచ్చినా కూడా రంజిత్‌తో రజినీకాంత్ సినిమా చేసేందుకు ఎలా ముందుకు వస్తున్నాడు అంటూ అంతా కూడా నోరెళ్ల బెట్టారు. ఫ్లాప్ ఇచ్చిన తాను రజినీకాంత్‌కు సక్సెస్ ఇవ్వాలనే పట్టుదతో దర్శకుడు రంజిత్ పా ‘కాలా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘కాలా’ చిత్రం రేపు విడుదలకు రంగం సిద్దం అయ్యింది.
‘కబాలి’ చిత్రంలో మాదిరిగానే ‘కాలా’ చిత్రంలో కూడా రజినీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ముంబయి గ్యాంగ్ వార్ నేపథ్యంలో ‘కాలా’ చిత్రం టీజర్ మరియు ట్రైర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రంజిత్ పా సినిమాను తెరకెక్కించాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఎప్పటిలాగే రజినీకాంత్ సినిమా అనగానే డైరెక్ట్ సినిమా కంటే భారీ ఎత్తున తెలుగులో విడుదల అవుతుంది. తమిళ డబ్బింగ్ అయిన ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగులో ఈ చిత్రంను భారీ మొత్తం పెట్టి ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 300 కోట్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు కలిగి ఉన్నారు. మరి వారి అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.