కాల రివ్యూ… తెలుగు బులెట్

kaala review

నటీనటులు : ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, షాయాజీ షిండే త‌దిత‌రులు
మ్యూజిక్ : స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ప్రొడ్యూసర్ : ధ‌నుశ్‌
డైరెక్షన్ : పా.రంజిత్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం విడుదల అయిన రోబో సినిమా తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ లేవు విక్రమసింహ, కొచ్చాయడన్, కబాలి వంటి సినిమాలు వచ్చినా ఏవి రజనీ స్టాండర్డ్ కి తగ్గవి కాకపోవడంతో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఇలా కొన్నేళ్ళ నుండీ హిట్ లేకపోయినా రజనీ సినిమాల కోసం సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే నప్పా అనుకుని తమిళ, కన్నడ, తెలుగు ప్రేక్షకుల్లో సింహా భాగం ఎదురుచూస్తూ ఉంటారు అంటే ఆయన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. వ‌య‌సుతో పాటు ఆయ‌న‌కున్న క్రేజ్ కూడా పెరిగితోంది. ముంబైలో వివక్షకు గురవుతున్న తమిళుల కోసం పోరాడే నాయకుడి పాత్రలో రజినీ కనిపించారు. వారి కోసం తానెలా డాన్ అవతారం ఎత్తింది , ప్రస్తుత రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఉద్రేకపూరిత సన్నివేశాలతో ముంబై‌లో ధారావి తమిళ ప్రజలు కోసం క‌రికాల‌న్‌ (రజినీ) చేసిన పోరాటమే కాలా. భారీ అంచ‌నాలతో మన ముందుకు వచ్చిన కాలా ఎలా ఉంది? అని చూడాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం రివ్యూ చదివేద్దాం రండి.

తిరున‌ల్వేలికి చెందిన క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) ప‌రిస్థితుల కార‌ణంగా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావిలో అందరు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని రాజ‌కీయ నాయ‌కుడు హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) ప్ర‌య‌త్నిస్తాడు. అయితే వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అయితే ఆ స్వార్ధ రాజకీయ నాయకుల నుండి తన ప్రాంత వాసులని ఎలా కాపాడుకున్నాడు అనేదే కాలా కధ.

కాలాగా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన ఈజ్ తో కూడిన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా ఆయ‌న కధే. రెండేళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ చేసిన కాలా ఆయ‌నకు రాజ‌కీయంగా ఉపయోగపడేలా తెర‌కెక్కింది. ఎందుకంటే ఇందులో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి. ఈ క్షణం వరకూ కూడా 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చించే సినిమా ఇది. కచ్చితంగా రజనీ రాజకీయాలకి ప్లస్ అవుతుంది. రజనీతో సమానంగా నటి ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ఇక నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో నానా క్యారెక్ట‌ర్‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది. ఇక సాంతికేకంగా చూస్తే ముర‌ళి.జి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోశ్ నారాయ‌ణ్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఒకే. సినిమాలో ర‌జనీ చేసే ఫ్లై ఓవ‌ర్ ఫైట్ సీన్‌.. ఇంట‌ర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి. పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు. అనే అతిపెద్ద లాజిక్ తో పా.రంజిత్ ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాడు. మొతానికి ఎనిమిదేళ్ళు అభిమానులని ఆకలితో ఉంచిన రజనీ ఇప్పుడు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టినట్టే.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : రజనీ అందించే పంచభక్ష్య పరమాన్ణ భోజన రుచిని ఆస్వాదించడానికి సిద్దం కండి
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3.5 / 5