సౌత్ ఎమ్మెల్యే తో కాజల్ ప్రేమాయణం…

Kajal Agarwal love affairs with Kalyan Ram in MLA Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుస విజయాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని, సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగిఉన్న నటి కాజల్ అగర్వాల్. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర చిత్రం హిట్ అవ్వడంతో అప్పటినుంచి ఇప్పటివరకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెనుకకు తిరగకుండా తెలుగు, తమిళ్, హింది, కన్నడ మలయాళం భాషల్లో వరుసుగా సినిమాలు తీస్తూ బిజీ తన కెరీర్ ను పరుగులు తీయిస్తుంది.

kajal agarwal Kalyan Ram MLA Movie Story

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా తెలుగులో ఒక సినిమా నిర్మాణం అవుతుంది. ఈ సినిమాకు ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ ను పెట్టిన విషయం తెలిసిందే, కాజల్ అగర్వాల్ దాదాపు 10 ఏళ్ల తరువాత తొలి చిత్ర కథానాయకుడు అయిన నందమూరి కళ్యాణ్ రామ్ తో నటిస్తుంది. ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ ఎన్నారై అమ్మాయిగా కనిపించనుందట. ఓ బిలియనీర్ కూతురైన కాజల్ ఇండియాకు ఎందుకు వచ్చింది, హీరోను ఎలా లవ్ లో పడేసిద్ది.? అసలు హీరో కి – ఆమె కు సంబంధం ఏంటి..? అనే కథాంశంతో ఈ సినిమా నిర్మాణం అవుతుందని సమాచారం అందుతుంది. యాక్షన్ , రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. MLA సినిమాకు మణిశర్మ స్వరాలందిస్తున్నారు.