ఎన్టీఆర్‌ కాబట్టి చేశా.. మళ్లీ చేయను

kajal agarwal says about ntr janatha garage item song

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా కొనసాగుతూ వచ్చి 50 చిత్రాలను పూర్తి చేసుకున్న ముద్దుగుమ్మ కాజల్‌. ఈ అమ్మడు ప్రస్తుతం రానాకు జోడీగా ‘నేనేరాజు నేనేమంత్రి’ చిత్రం మరియు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా ‘ఎమ్మెల్యే’ అనే చిత్రాలను చేస్తుంది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈమెతో ఐటెం సాంగ్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌ నుండి కూడా కాజల్‌కు ఐటెం సాంగ్‌ చేసే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. కాని ఐటెం సాంగ్‌కు మాత్రం కాజల్‌ నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది.

ఎన్టీఆర్‌ ‘జనతాగ్యారేజ్‌’ చిత్రంలో పక్కాలోకల్‌ అంటూ ఈ అమ్మడు చేసిన ఐటెం సాంగ్‌కు అదిరిపోయే మార్కులు పడ్డాయి. సినిమా సక్సెస్‌లో ఆ ఐటెం సాంగ్‌ కీలకంగా ఉపయోగం అయ్యింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే కాజల్‌ను ఐటెంగా తమ సినిమాలో చూపించేందుకు స్టార్‌ హీరోలు మరియు దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారు. కాని ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం మరియు ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఆ ఐటెం సాంగ్‌ చేశాను తప్ప, తనకు ఐటెం సాంగ్‌లు చేసే ఉద్దేశ్యం లేదని, హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినంత కాలం సినిమాల్లో ఉంటాను, రాని సమయంలో సినిమాలకు దూరం అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలనైనా వదులుతాను కాని ఐటెం సాంగ్‌ మాత్రం చేయను అనేది కాజల్‌ మాట.


మరిన్ని వార్తలు

ప్రభాస్‌ను పొడిచేసిన బాలీవుడ్‌ హీరో

మళ్లీ చోటా మేస్త్రీ