కాజల్ తో సారి చెప్పించుకున్న మీడియా…!

Kajal Aggarwal Say Sorry To Media

ఏదైనా సినిమాను ప్రమోట్ చెయ్యాలి అంటే మీడియానే కావాలి, ఏ చిన్న వార్తా అయినా ప్రాచుర్యం దక్కించుకోవాలి అంటే మీడియా పాత్ర చాలా వరకు ఉంటుంది. అలాంటి మీడియా వారిని కొతమంది సెలబ్రిటీస్ తమకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకుంటున్నారు. ప్రెస్ మీట్ లకు ఆలస్యం గా వస్తే తమకు ఉన్నా క్రేజ్ పెరుగుతుంది అనుకుంటారు ఏమో, ప్రతి ఒక్కరు మీడియా సమావేశానికి ఎక్కువగా ఆలస్యంగా హాజరుఅవ్వుతారు. ఈ మద్య తమన్నా కూడా ఓ సినిమా ఇంటర్వ్యూ కోసం నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

kajal

తమన్నా మాత్రం అనుకున్న టైం కి కాకుండా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో మీడియా వారు సహనం కోల్పోయారు. ఎంతో ఒప్పికగా ఆమె వచ్చే దాక ఎదురు చూసి ఆ తరువాత ఇంటర్వ్యూ చెయ్యడం స్టార్ చేశారు. ఆ తరువాత మరి కొద్ది రోజులకు కవచం మూవీ ప్రెస్ మీట్ లో కాజల్ అగర్వాల్ కూడా అంతే లేట్ గా రావడం తో మీడియా సోదరులు ఆమె రాగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. అందుకు కాజల్ అగర్వాల్ స్వారి చెప్పిన కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. దాంతో ప్రెస్ మీట్ మరో రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా వారు అంటే చులకనగా చూసేవారికి ఇదో గుణపాఠం అన్నారు. ఆతర్వాత పరిస్తితి సర్దుమనగడంతో మళ్ళీ కాజల్ మీడియా సమావేశానికి వచ్చింది.

Kajal-Aggarwal