కేసీఆర్ అనే నేను…సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్…!

Kalvakuntla Chandrashekar Rao Swear In As Cm Of Telangana

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ రోజు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే మధ్యాహ్నం 1.25 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. కేసీఆర్ చేత ప్రమాణం చేయించారు. సీఎంగా ప్రమాణం చేయడం కేసీఆర్‌కు ఇది రెండోసారి. వాస్తవానికి కేసీఆర్ బుధవారమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం సాగింది. బుధవారం మధ్యాహ్నం 12.49 గంటలకు మార్గశిర పంచమి తిథిలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అందుకు అనుగుణంగా కేసీఆర్‌ను టీఆర్ఎస్ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిఉంది. కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్‌ను ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ ప్రమాణస్వీకారం గురువారానికి వాయిదా పడింది. వారం రోజుల్లో కేబినెట్ కూర్పు చేసి మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

kcr-governer

కేసీఆర్ దైవ సాక్షిగా ప్రమాణం చేయగానే సభా ప్రాంగణమంతా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. ప్రమాణస్వీకారం పూర్తవగానే కేసీఆర్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం మొహమూద్ అలీ తెలంగాణ మంత్రిగా అల్లాహ్ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు, నేతలు భారీగా తరలివచ్చారు. మాణస్వీకారోత్సవం అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీ మీడియా కోసం ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ఆ తరవాత వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు.

telangana-cm-kcr