Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఎమ్మెల్యే’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించగా, ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈనెల 23న విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్ రామ్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ వేడుకల వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం సురేష్‌బాబు ఈ విషయమై మాట్లాడుతూ సినిమాలు ఫ్లాప్ అయితే సక్సెస్ మీట్‌లు, థ్యాంక్స్ మీట్‌లు ఏర్పాటు చేయడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అని చెప్పుకొచ్చాడు. తాజాగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమా సక్సెస్ కాకుంటే పరాజయంను ఒప్పుకుని తర్వాత సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టాలి కాని, సినిమా బాగాలేక పోయినా కూడా ప్రేక్షకులను మోసగించి, బాగుందని చెప్పి వారిని మోసం చేయడం తప్పని చెప్పుకొచ్చాడు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారు. సినిమా బాగలేక పోతే బాగుందని ప్రచారం చేసి వారిని థియేటర్‌కు రప్పించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అంటూ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది.