Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కాజల్ హీరోయిన్గా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎమ్మెల్యే’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదలకు ముందు అందరి దృష్టిని ఆకర్షించింది. కాని విడుదలైన తర్వాత సినిమా ఢీలా పడిపోయింది. మొదటి రెండు రోజులు ఒక మోస్తరు కలెక్షన్స్‌ను రాబట్టిన ‘ఎమ్మెల్యే’ చిత్రం ఆ తర్వాత పూర్తిగా డ్రాప్ అయ్యింది. ఇక గత శుక్రవారం ‘రంగస్థలం’ చిత్రం రావడంతో ‘ఎమ్మెల్యే’ కనిపించకుండా పోయాడు. అక్కడక్కడ కొన్ని థియేటర్లలో ఎమ్మెల్యే కొనసాగుతున్నా కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.
‘ఎమ్మెల్యే’ చిత్రంకు వచ్చిన పబ్లిసిటీ మరియు క్రేజ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 22 కోట్లకు అమ్ముడు పోయింది. అయితే సినిమా ఇప్పటి వరకు కనీసం 15 కోట్లను కూడా రాబట్టలేక పోయింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 1.75 కోట్ల నష్టంతో బిజినెస్‌ను క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 7 కోట్ల మేరకు డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోయి ఉంటారు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే చిత్ర నిర్మాత మాత్రం టేబుల్ ప్రాఫిట్‌తో బయట పడ్డాడు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌ను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నుండి వారికి ఎలాంటి హామీ రాలేదు.