యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒకప్పుడు నటించిన చిత్రాలకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున క్రేజ్ ఉండేది. కాని ఇప్పుడు కమల్ మూవీకి పెద్దగా క్రేజ్ ఉండటం లేదు. ఈయన గత కొంత కాలంగా చేస్తున్న చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతున్నాయి. దాంతో ఈయన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా మెల్లమెల్లగా సినిమాలకు దూరం అవుతున్నాడు. కమల్ నటించిన విశ్వరూపం 2 చిత్రం దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం విడుదల అయితేనైనా కమల్ మళ్లీ ఫాంలోకి వస్తాడేమో అని అంతా భావించారు. కాని విశ్వరూపం 2 చిత్రం విడుదలకు అంతా సిద్దం అయిన తర్వాత వాయిదా వేయడం జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. దానికి తోడు రెండు రోజుల పాటు థియేటర్ల బంద్‌ను ప్రకటించారు. ఈ సమయంలోనే తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా కమల్ ప్రకటించాడు. షూటింగ్ మరియు ఇతర అన్ని రంగాలకు సంబంధించిన సినీ కార్మికులు రెండు రోజుల పాటు బంధ్‌ను పాటిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వరూపం 2ను విడుదల చేయడం ఏమాత్రం సమంజసం కాదని, అందుకే విడుదల చేయాలని కమల్ నిర్ణయించుకున్నాడు. మరో రెండు రోజుల్లో విశ్వరూపం వస్తుందని భావిస్తున్న సమయంలో ఇలా జరగడంతో కమల్ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కమల్‌కే ఎందుకు ఇలా అవ్వాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమల్‌కు గత కొంత కాలంగా సినిమా పరంగా బ్యాడ్ టైం కొనసాగుతుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది.