Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వరూపం’ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కమల్ తెరకెక్కించిన ‘విశ్వరూపం 2’ చిత్రం మూడు నాలుగు నెలల గ్యాప్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అయిదు సంత్సరాలు అయినా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. గత ఆరు నెలలుగా మళ్లీ కమల్ హాసన్ ఆ సినిమాకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్బంగా సినిమాను విడుదల చేస్తాను అంటూ ప్రకటించిన కమల్ హాసన్ అనుకున్న సమయంకు విడుదల చేయడంలో విఫలం అయ్యాడు.
తాజాగా విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అని, డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారని తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ‘విశ్వరూపం 2’ను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యంతో నిర్మాత ఉన్నాడు. అయిదు సంవత్సరాల ఎదురు చూపులకు ఈసారి అయినా బ్రేక్ పడుతుందా అని సినీ వర్గాల వారు కొందరు చర్చించుకుంటున్నారు. విశ్వరూపం సినిమా విడుదల సమయంలో కమల్ హాసన్ చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.
ఆ సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి తమిళనాడు ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కమల్ సినిమాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనేక అవాంతరాల మద్య సినిమా విడుదలైంది. తాజాగా ‘విశ్వరూపం 2’పై సినీ వర్గాల్లో ఆసక్తి కలగడానికి అదే కారణంగా చెప్పుకోవచ్చు. కమల్ త్వరలో ‘ఇండియన్’ చిత్రంతో బిజీ కాబోతున్నాడు. అంతకు ముందే ‘విశ్వరూపం 2’ను విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.