Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. ఒక వైపు సీఎం పళ్లని స్వామికి బలం లేదు, వెంటనే సీఎం రాజీనామా చేయాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం మాత్రం రాజీనామాకు ససేమేర అంటున్నాడు. అసెంబ్లీలో బల నిరూపణకు పిలవాలని గవ్నర్ను కూడా విపక్షాలు కోరడం జరిగింది. పరిస్థితులు చూస్తుంటే మరి కొన్ని రోజుల్లోనే తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి సరైన బలం లేకపోవడం వల్ల రాష్ట్రపతి పరిపాలన ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సమయంలో రజినీకాంత్ పార్టీ పెడతానంటూ, అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎన్నికలు హఠాత్తుగా వస్తే రజినీకాంత్ ఏం చేస్తారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న.
ఈ గందరగోళం మద్య కమల్ హాసన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రముఖులకు మరియు సినీ వర్గాల వారికి కూడా ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.ఇటీవలే తాను తల్చుకుంటే నాయకుడిని అయిపోతాను అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన కమల్ హాసన్ తాజాగా మరోసారి తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి పెరిగింది. అవినీతిమయంగా రాజకీయం తయారైంది. ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది, ఈ సమయంలో తమిళనాడు ప్రజల అంతా కూడా పోరాటానికి సిద్దంగా ఉండాలంటూ కమల్ పిలుపునివ్వడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. రజినీకాంత్ తరహాలోనే కమల్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తమిళనాట చర్చ జరుగుతుంది. అయితే కమల్ మాత్రం ఆ విషయంపై సమాధానం దాటవేస్తున్నాడు.
మరిన్ని వార్తలు: