హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ…స్పందించిన యాజమాన్యం…!

Kamineni Hospital Respond Selfie

నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో కామినేని ఆస్పత్రిలో చేరిన నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భౌతిక కాయంతో కామినేని ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీ దిగడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. హరికృష్ణ భౌతికకాయంతో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులు, ఒక వార్డు బోయ్, వార్డ్ గర్ల్ కలిసి నవ్వుతూ సెల్ఫీలు దిగారు. ఈ ఘటనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

kamenani-hopital-harikrishn

ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కామినేని ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. సదరు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.

harikrishna