Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఒక సెట్టింగ్‌లో జరుపుతున్నారు. ఈ చిత్రంలో కంగనా వీరనారి జాన్సీ పాత్రలో కనిపించబోతుంది. పలు యుద్ద సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు కంగనాపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగానే కంగనా ముక్కుపై గాయం అయ్యింది.
విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. కత్తి యుద్దంలో పాల్గొంటున్న సమయంలో కత్తి తలిగి ముక్కుపై గాయం అయ్యింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. డాక్టర్లు కూడా ప్రమాదం తృటిలో తప్పిందని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అపోలో హాస్పిటల్లో కంగనా రనౌత్‌కు చికిత్స చేయించారు. రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కంగనాకు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న కంగనా గాయం మానిన వెంటనే షూటింగ్లో పాల్గొంటాను అంటూ చెబుతుంది. ముక్కుపై గాయం అవ్వడంతో నాలుగు కుట్లు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనతో చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో దర్శకుడు క్రిష్ ఊరిపి పీల్చుకున్నాడు.
మరిన్ని వార్తలు