కడప స్టీఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రెస్ మీట్ లోని మెయిన్ పాయింట్స్ మీ కోసం
- రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని మీడియాలో వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్..
- గతంలోను బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా వార్తలు రాశారు..
- కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వం కోర్ట్ లో వేసిన ఆపిడివిట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- రైల్వే జోన్ అనేది రాజకీయ నిర్ణయం..
- జోన్ ఇస్తామని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు..
- పత్రికకలకు బీజేపీ అంటే ఎంత అంత ద్వేషమో తెలియడం లేదు..
- రాజకీయ పార్టీలకు దురుద్దేశాలు ఉంటాయి.. మీడియాకు ఎందుకు దురుద్దేశాలు ఉన్నాయో అర్థం కావడంలేదు..
- రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది..
- చంద్రబాబుకు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గు ఉందా..
- దాదాపు పూర్తయైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు ఏమి చేశారు…
- చంద్రబాబు అనుభవాన్ని అవినీతి చేయడానికి ఉపయోగిస్తున్నారు..
- హోదాపై అనేక సార్లు మాట మార్చిన చంద్రబాబు కు ఏమి పరికత్వత ఉంది..
- రాష్ట్ర అభివృద్ధి పై చంద్రబాబుతో చర్చ చేయడానికి మోడీ అవసరం లేదు…
- చంద్రబాబు స్థాయికి నేను చాలు..
- చంద్రబాబు దమ్ముంటే నాతో చర్చకు రావాలి..
- హిందూత్వపై చంద్రబాబు దాడికి దిగుతున్నారు..
- శివ స్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు..
- ఎన్నికల్లో గెలవడం కోసమే చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అంశాన్ని ఎత్తుకున్నారు..
- 2004 సంవత్సరంలో ముద్రగడ రిజర్వేషన్లు కోసం పోరాటం చేస్తే చంద్రబాబు కాపు రిజర్వేషన్లు తీవ్రంగా వ్యతిరేకించారు..
- చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు..
- రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపుతామని చంద్రబాబు చెప్పలేదు..
- ఉద్యమం చేసిన కాపులను చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురిచేశారు..
- తుని ఘటనలో కాపులపై చంద్రబాబు అనేక తప్పుడు కేసులు పెట్టించారు
- ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు..
- రిజర్వేషన్ పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్ళు కాలయాపన చేశారు..
- బీసీ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకుండా రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు కేంద్రంకు పంపారు..
- బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడులు చేయించారు..
- బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోంది.
- రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు..