Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకపోవడం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారశైలి చూస్తే అర్ధం అవుతుంది. బీపీ తెచ్చుకుని మరీ ఏపీలో బీజేపీ పగ్గాలు పట్టుకునే అవకాశం అందుకున్న కన్నా నిన్న ప్రధాని మోడీ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అక్కడ నుంచి బయటకు వస్తూనే మోడీ మాటగా మోసం చేసింది చంద్రబాబే, ఇప్పటికీ కేంద్రం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న రొటీన్ చిలకపలుకులు పలికేసారు. నిజంగానే మోడీ గారు కన్నా తో ఈ విషయం చెప్పి వుంటారా అన్న సందేహాలు వస్తుండగానే అసలు ఆ ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుంటుందని కన్నా స్వయంగా ప్రధానికి ఓ వినతిపత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ పత్రంలో 12 విషయాలపై కేంద్రం దృష్టిపెట్టాలని కన్నా కోరారు. ఆ 12 ఇవే.
1 . విశాఖ రైల్వే జోన్
2 . కడప స్టీల్ ఫ్యాక్టరీ
3 . గిరిజన విశ్వవిద్యాలయం
4 . దుగరాజపట్నం బదులుగా రామాయపట్నం పోర్ట్.
5 ఐఓసీ లేదా hpcl ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్.
6 . విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.
7 . కేంద్రీయ విద్యాసంస్థలకు మరిన్ని నిధులు
8 . వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న 50 కోట్ల సాయాన్ని 150 కోట్లకి పెంచడం.
9 . ఏపీ లోని 7 వెనుకబడిన జిల్లాలకు జీఎస్టీ పన్ను రాయితీలు.
10 . 4 రాయలసీమ జిల్లాలకు ఇండస్ట్రియల్ కారిడార్.
11 . గిరిజన, మత్స్యకార అభివృద్ధికి మరిన్ని నిధులు .
12 . స్టార్ట్ అప్, ఇంక్యూబేటివ్ సంస్థలకు పన్ను రాయితీలు.
ఇలా 12 అంశాలు మిగిలే ఉన్నాయని ఈ విజ్ఞాపన పత్రం ద్వారా కన్నా స్వయంగా ఒప్పుకున్నట్టు అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ప్రత్యేక హోదా, పోలవరం గురించి కన్నా మర్చిపోయారు పాపం. ఆ రెండు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అది రాజకీయంగా ఎక్కడ చంద్రబాబుకి లబ్ది చేకూరుతుందో అన్న బీజేపీ భయం గురించి కన్నా కి కూడా తెలిసిపోయింది అనుకుంటా. అందుకే మోడీ దగ్గర ఆ రెండు అంశాలు మర్చిపోయారు కన్నా. ఆ 12, ఈ 2 కలిపితే కేంద్రం 14 అంశాలపై ఇంకా మొండిగానే వుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఇచ్చిన హామీల్లో కేంద్రం 85 శాతం నెరవేర్చిందని కన్నా చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.