Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం చూసాక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న ఆశలు ఎవరికీ లేవు. వైసీపీ కి వీరాభిమానులు కూడా పూర్తి నిరాశ, నిస్పృహలతో బయటికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో కాకినాడలోనూ యుద్ధానికి ముందే వైసీపీ ఓటమి ఖరారు అయ్యింది. అయితే అంతకన్నా ముందే వైసీపీ నేత కన్నబాబు ఆ పార్టీ కి గొయ్యి తవ్వేశారు. అప్పుడే ఆ పార్టీ ఓటమి ఖరారైంది.కాకుంటే నంద్యాల ఓటమి తర్వాత ఆ విషయం బయటికి వచ్చింది. ఇంతకీ వైసీపీ కి కన్నబాబు ఏ విధంగా గొయ్యి తీసాడో చూద్దాం.
2009 లో కాకినాడ రూరల్ నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబు ఆ తర్వాత చిరు ని అనుసరిస్తూ కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో 2014 ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన పాత అనుచరులు అందర్నీ తన కోసం పని చేయమని అడిగారు. వారిలో ఏ కొద్దీ మందో తప్ప ఎక్కువ మంది టీడీపీ లేదా వైసీపీ కి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఆయన వైసీపీ లో చేరారు. ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయనకి పాత పగ తీర్చుకునే టైం వచ్చింది. టికెట్స్ కేటాయింపులో ఆయన మాటకి విలువ వచ్చింది. ఇంకేముంది ? 2014 లో తన కోసం పని చేయని వారిని గుర్తు పెట్టుకుని మరీ వారికి వైసీపీ టికెట్ రాకుండా చేశారు. దీంతో ఆయన పగ చల్లారిందేమో గానీ అది నుంచి వైసీపీ కి పనిచేసిన వారికి సీట్లు పోయాయి. వారికి పార్టీ మీద అభిమానం పోయింది. ఆ విధంగా కాకినాడలో వైసీపీ కి కన్నబాబు ముందే గొయ్యి తీసాడు. ఇప్పుడు రాబోయేది ఓటమి ఇక లాంఛనమే.
మరిన్ని వార్తలు: