అబ్బే అదేం లేదట…!

Kareena Kapoor Khan To Join Politics

బాలీవుడ్‌ లో మాజీ హీరోయిన్‌ కరీనా కపూర్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని నిన్నటి నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తనకు అలాంటి ఉద్దేశమే లేదని కరీనా స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో ఆమె నిలవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోండగా భోపాల్ రాజ వంశస్తుడైన మన్సూర్ అలీఖాన్ వారసుడు సైఫ్ అలీఖాన్‌ భార్యగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే 1991 లోక్‌సభ ఎన్నికల్లో కరీనా మామ (సైఫ్ అలీఖాన్ తండ్రి), మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తాను పోటీ చేయబోతున్నట్లు వచ్చిన వదంతులను నటి కరీనా కపూర్ కొట్టిపారేసింది.

ఏ పార్టీవారు కూడా తనతో సంప్రదింపులు జరపలేదని ప్రస్తుతం తన ధ్యాసంతా సినిమాలపేనే ఉందని చెప్పింది. కరీనా, సైఫ్ దంపతులకు తైమూర్ అనే బాబు ఉన్నాడు. అయితే గతంలో బాలీవుడ్‌ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ కూడా బీజేపీ నుండి లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్నారని ప్రచారం జరగగా అందులో నిజం లేదని ఆమె స్పష్టం చేయడం తెలిసిందే. కాగా, మధ్యప్రదేశ్‌లో 15ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. భోపాల్ స్థానాన్ని కాంగ్రెస్ గెలవాంటే కరీనాకు సీటు కేటాయించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయడంతో ఈ ప్రచారం మొదలైంది.