కార్తి జపాన్: ఒక మంచి టైంపాస్ మూవీ

కార్తి జపాన్: ఒక మంచి టైంపాస్ మూవీ
Cinema News, Cinema News, Entertainment

కార్తి చిత్రం అంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి అంచనాలుంటాయి. పైగా ఈయన ట్రాక్ రికార్డ్ కూడా రెండేళ్లుగా చాలా బాగుంది. దాంతో ఈ సారి కూడా కచ్చితంగా కార్తి మాయ చేస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్ అందరూ . దానికి తోడు జపాన్ టైటిల్ కూడా విచిత్రంగా ఉన్నది మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..

మూవీ రివ్యూ: జపాన్

కథ:
సిటీ సెంటర్‌లో ఉన్న పెద్ద నగల షాప్‌లో ఏకంగా 200 కోట్ల బంగారం చోరీ అవుతూ ఉంది . అదెవరు చేసారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో బాగా పేరు మోసిన దొంగ జపాన్ (కార్తీ) పని అని గుర్తిస్తారు పోలీసులు అందరూ . ఆ కేసును పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ (సునీల్) చూస్తుంటారు. అందులో ఆయనకు కొన్ని ఆధారాలు కూడా దొరుకుతాయి. దాంతో జపాన్ కోసం వేట మొదలవుతుంది. అదే సమయంలో జపాన్‌కు సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. తనతో సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంజు(అను ఇమ్మానియేల్)ను ఇష్టపడుతుంటాడు. ఆమె కారణంగా జపాన్ పోలీసులకు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏమైంది..? అసలు తనను ఈ కేసులో ఇరికించింది ఎవరు అనేది తెలుసుకోడానికి జపాన్ బయల్దేరతారు .

కథనం:
కార్తి సినిమా అంటే మినిమమ్ ఉంటుందనే నమ్మకం ఉండేది. జపాన్ చూసాక ఆ నమ్మకం పోయింది. అప్పుడప్పుడూ ఆయన కూడా తప్పులో కాలేస్తుంటాడు అనిపించింది. తలా తోక లేకుండా సాగే జపాన్ కథకు కార్తి ఎలా ఓకే చెప్పాడో అర్థం కాలేదు. కారెక్టరైజేషన్ పరంగా మాత్రం జపాన్ అదుర్స్ అంతే. ముఖ్యంగా కార్తి డైలాగ్ డెలివరీ అదిరిపోయింది.. కామెడీ పుట్టిస్తుంది. కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం జపాన్ చాలా వీక్. స్క్రీన్ ప్లే మరింత వీక్.. అక్కడే సినిమా కూడా వీక్ అయిపోయింది. ఫస్టాఫ్ అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. క్లైమాక్స్ మరింత డల్. ఇటు వైపు మదర్ సెంటిమెంట్ లేక.. అటు యాక్షన్ లేక.. మధ్యలో ఎటూ కాకుండా మిగిలిపోయారు జపాన్. చాలా రోజుల తర్వాత కార్తి నుంచి నాసీరకం మూవీ వచ్చింది.. దర్శకుడు రాజు మురుగన్ మంచి ఛాన్స్ ని మిస్ చేసాడు. ఓవరాల్‌గా జపాన్.. మేడ్ ఇన్ చైనా ప్రాడక్ట్‌లా తుస్సుమంది. హీరోని కామెడీ దొంగగా చూపిస్తూ కామెడీ చేయడం అనేది చిన్న విషయం కాదు. గతంలో కొందరు దర్శకులు దాన్ని చేసి చూపించారు కానీ రాజు మురుగన్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారు . తల్లీ కొడుకు ఎమోషన్ చూపించిన కాసేపటికే.. దొంగతనం సీన్స్ పెట్టి కథను కలగాపులగం చేసాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే లోపాలు ఈ సినిమా కి మైనస్. సునీల్, విజయ్ మిల్టన్ వేర్వేరు చోట్ల చేసే ఇన్వెస్టిగేషన్ కూడా ఏ మాత్రం థ్రిల్ అని అనిపించదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత కథ మరింత నీరసంగా ఉంటుంది .

కార్తి జపాన్: ఒక మంచి టైంపాస్ మూవీ
Karthi ” Japan “

నటీనటులు:
కార్తీకి పేరు పెట్టడానికి లేదు.. ఆయన చాలా బాగా నటించాడు. ముఖ్యంగా కారెక్టరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఊహకు తగ్గట్లుగా జపాన్ పాత్రలో ఒదిగిపోయాడు కార్తి. అను ఇమ్మానియేల్ మరోసారి ఇలా కనిపించి మాయమయ్యే పాత్రలో నటించింది. సునీల్ లెంత్ బాగానే ఉన్నా.. పాత్రలో పవర్ లేదు. కెఎస్ రవికుమార్, జితన్ రమేష్, విజయ్ మిల్టన్ లాంటి వాళ్లున్నా ఎవరికీ కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేనేలేదు .

టెక్నికల్ టీం:
జివి ప్రకాష్ కుమార్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు బాగోలేవు.. అక్కడక్కడా ఆర్ఆర్ మాత్రం బాగుంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఇంపాక్ట్ లేదు. కానీ తప్పు ఆయనది కాదు.. ఆయనతో పని చేయించుకున్న దర్శకుడు రాజు మురుగన్‌కు క్లారిటీ లేనపుడు ఎడిటర్ ఏం చేయలేడు. డ్రీమ్ వారియర్ నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. దర్శకుడు మాత్రం అస్సలు ఛాన్స్ వాడుకోలేదు.