కత్తి పప్పులో కాలేశాడు…పవన్ కి భలే ఛాన్స్ దొరికింది.

kathi-mahesh-comments-on-bj
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనసేన అధినేత ప్రియశత్రువుగా పేరుపడ్డ కత్తి మహేష్ బడ్జెట్ సందర్భంగా పప్పులో కాలేశాడు. నిజానికి ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కత్తి ఈమధ్య రాజకీయాల మీద ఫోకస్ పెంచాడు. అయితే ఆయన రాజకీయ కామెంటరీ విన్నవాళ్లకు వైసీపీ గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా వినిపించదు. అయితే బడ్జెట్ వచ్చిన వేడిలో ఆయన ఈసారి బీజేపీ తో ఎవరు పొత్తు పెట్టుకున్నా ప్రజా ఆగ్రహాన్ని చూడాల్సివస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ బీజేపీ తో పొత్తుకు తహతహలాడుతున్న వైసీపీ కి బాగా సరిపోతుంది. ఈ విషయం కత్తి కి అర్ధం అయ్యిందో,లేదో మరి.

ఇక కత్తి విమర్శలకు టార్గెట్ గా మారిపోయిన జనసేన అధినేత పవన్ కి బడ్జెట్ , తాజా రాజకీయ పరిణామాలు పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి. ఆంధ్రులకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ మీద నేరుగా దాడి చేయడానికి అధికార, ప్రతిపక్షాలు రెండూ సతమతం అవుతున్నవేళ పవన్ కి బంగారం లాంటి ఛాన్స్ దొరికినట్టే. రానున్న రోజుల్లో తలపెట్టిన ఒంగోలు ,రాజమండ్రి పర్యటనల్లో బడ్జెట్ అంశం పవన్ కి తిరుగులేని అస్త్రం. ఈ మధ్య పర్యటనల్లో , ప్రకటనల్లో స్పష్టత లోపించిందని పవన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆ అపవాదు పోగొట్టుకోవడంతో పాటు కేంద్రాన్ని నిలదీసే దమ్ముంది అని నిరూపించుకోడానికి దొరికిన అవకాశాన్ని పవన్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.