Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నూతన సంవత్సరం సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను కొత్త సంవత్సరం సందర్బంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దేశంలోనే మొదట మొదటి సారిగా కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ పథకంను పవన్ కళ్యాణ్ అభినందించాడు. కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో పవన్ భేటీ అయ్యి అభినందనలు తెలియజేశాడు. ఇక్కడ వరకు బాగనే ఉంది. పవన్ చేసే ప్రతి పనిని విమర్శిస్తూ ఇటీవల మీడియాలో తెగ పాపులర్ అయిన కత్తి మహేష్ తాజాగా మరోసారి నోరు పారేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్, కేసీఆర్‌ల భేటీ వెనుక ఉన్న కారణంను కత్తి మహేష్ విశ్లేషించాడు.
కొన్నాళ్ల క్రితం వరకు కేసీఆర్ అంటే విరుచుకు పడ్డ పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఎందుకు ఇలా వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పాడు అనే విషయం అందరు ఆలోచించాలి. కేసీఆర్‌ను పవన్ రాజకీయ ఉద్దేశ్యంతో కలవలేదని, సినిమా కోసం కలిశాడు అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో అజ్ఞాతవాసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రీమియర్ షోల కోసం తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. గతంలో పవన్ నటించిన సినిమాలకు ప్రీమియర్ షోల అనుమతి ఇవ్వలేదు. ఇక ఈసారి కూడా అలాగే జరిగితే నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని, అందుకే ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తారనే ఉద్దేశ్యంతో ఇలా కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఉంటాడు అంటూ కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు.