ఎన్నికల ప్రచారం చేయడానికి సరిగ్గా ఐదు రోజుల గడువే ఉంది. ఇప్పటికే అధికారిక తెరాస పార్టీ వార్త పాపేర్లలోను, టీవీ ఛానెళ్ళలోనూ, రహదారి వెంబట హోర్డింగులతోనూ, సోషల్ మీడియాలోనే కాకుండా, యూట్యూబ్ యాడ్స్ లోనూ తన మనుగడ చూపిస్తూ, తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా అన్ని ప్రణాళికలు చేస్తుంది. ఇవేకాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రముఖ గాయనీగాయకులతో పాటలు చేయించి, అంతటా వినపడేలా ప్రదర్శిస్తుంది. ఏదిచేసినా ఈ ఐదు రోజులే అన్న చందాన ఇప్పుడు మరో పాటతో ముందుకొచ్చింది.
ఈ పాటను ప్రముఖ గాయకుడూ కారుణ్య ఆలపించగా, గడ్డం వీరు రచన చేశారు. ఈ పాటలో కేసీఆర్ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఏమి చేశారు? రాష్ట్రాన్ని ఎంత ప్రగతిపథాన నడిపారు? చేపట్టిన పథకాలు ఏమిటీ? అనే విషయాలన్నింటిని పొందుపరిచి, కారుణ్య స్వరంతో మధురంగా పాడించి, ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ పాటలు నిత్యం రాజకీయాలను సూక్ష్మంగా గమనిస్తున్న ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతాయో తెలియదుగానీ, పాటలో వివరించిన అంశాల మీద ఆలోచన కలిగించేలా చేయగలవు అనేది కాదనలేని విషయం. ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ముఖం ఉన్న బొమ్మే, పాటే అవుతుండడం గమనించాల్సిన విషయం. ఇది కూడా ఒక అస్త్రం గానే భావించాలి రాబోతున్న ఎన్నికల సమరంలో పోరాడడానికి.