కవితకు సొంతిల్లు కూడా లేదట…పాపం…!

MP Kavitha Supporting AP CM Chandrababu Naidu

తెలుగు రాజకీయాలు వేడెక్కాయి, ఒకపక్క తెలంగాణాలో అసెంబ్లీ రద్దు చేసిన కేసీఅర్ ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం దృష్ట్యా ఆ పార్టీ నేతలు అన్ని మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే రీతిలో ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ప్రతిపక్ష నేతలు అవినీతిపరుల కుటుంబం అని విమర్శిస్తున్నారని కానీ నిజానికి తనకు ఇంతవరకూ సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చారు.

kcr-kavita
ఆమె ఏమంటూ ఆ మాట అన్నారో కానీ దానినే ప్రత్యర్ధి పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆయుధంగా చేసుకున్నాయి. ఇప్పటికే కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రచరం చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల వారు, ఇప్పుడు కొత్తగా కవిత ఇల్లు అంశాన్ని కూడా చేర్చి ఇప్పుడు సొంత కూతురికే ఇల్లు కట్టించలేని కేసీఆర్ ఇంకా ప్రజలకి ఏమి కట్టిస్తాడని ?, అలాగే మరి కొందరు ఇల్లు లేదని కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ పధకానికి అప్లై చేసుకుంటే మీకూ ఒక ఇల్లు గాలిలో కట్టించి ఇచ్చేవారు కదా(వ్యంగ్యంగా) అంటూ విమర్శలు మొదలెట్టారు. నిజానికి ఒక ఎంపీ, రాష్ట్ర స్తాయిలో ఒక ఉద్యమ సంస్థకు సారధి(తెలంగాణా జాగృతి), ఒక ముఖ్యమంత్రికి తనయ అయిన కవిత ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే మరి!

kavitha