Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
KCR For Comprehensive Development Of Karimnagar
కరీంనగర్ ను లండన్ చేస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కరీంనగర్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, కేసీఆర్ పిట్టల దొర మాదిరిగా హామీలిస్తున్నారని విమర్శించాయి. దీంతో రెచ్చిపోయిన కేసీఆర్ విపక్ష నేతలకు బుద్ధి లేదని, వాళ్లు తెలివి లేని గొర్రెలని కామెంట్ చేశారు.
చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకడమే కానీ ప్రభుత్వానికి సరైన సలహాలిచ్చిన పాపాన పోలేదని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు కేసీఆర్. పైగా కరీంనగర్ ను లండన్ చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మళ్లీ చెప్పారు. లండన్ కు థేమ్స్ నదిలా, కరీంనగర్ కు మానేరు ఉందని, మానేరు టూరిజం ప్రాజెక్టు ప్రారంభణైందని, అది పూర్తైతే అప్పుడు కరీంనగర్ అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుస్తుందని చెప్పేశారు కేసీఆర్.
పాత హామీ నిలబెట్టుకుంటానని చెప్పడంతో.. కొత్త ఆశను కూడా వ్యక్తం చేశారు కేసీఆర్. కరీంనగర్లో హరితహారంలో పాల్గొన్న కేసీఆర్.. హరిత కరీంనగర్ కావాలని కోరారు. రెండేళ్ల తర్వాత కరీంనగర్లో దిగితే అడవిలో దిగుతున్నామా అనేంతగా చెట్లు పెంచాలని స్థానికుల్ని కోరారు. కరీంనగర్ హరిత పట్టణంగా మారి.. తెలంగాణకు ఆధర్శంగా నిలవాలన్నారు కేసీఆర్. మొత్తం మీద కరీంనగర్ వాసుల్ని బాగానే ఆకట్టుకున్నారు కేసీఆర్.
మరిన్ని వార్తలు :