Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
KCR Forming Six Members politbeauro
ఉద్యమ కాలంలో భారీ కార్యవర్గం, భారీ పొలిటిబ్యూరో అంటూ హడావిడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం చిన్న కుటుంబమే చింతల్లేని కుటుంబం అని స్పీచ్ లు దంచుతున్నారు. పొలిటిబ్యూరో ఇప్పటివరకూ 40 మంది సభ్యులుంటే.. అంత మంది ఎందుకు.. ఆరుగురు చాలన్నట్లుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎక్కువమంది ఉంటే పార్టీకి తలనొప్పి తప్ప ఉపయోగం లేదనే భావన వ్యక్తమైంది.
అటు పార్టీ నేతలు కూడా కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ట్యూన్ అయ్యారు. పార్టీలో సర్వం అధినేతే కాబట్టి. అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని, అంత మాత్రం దానికి పొలిటిబ్యూరోలో ఎంతమంది ఉంటే ఏంటనే అభిప్రాయం కూడా నేతల్లో ఉంది. పైగా నియోజకవర్గాల్లో పోటీకి నేతలు ఎక్కువ మంది అందుబాటులో ఉండాలి కానీ.. అలంకార ప్రాయమైన పదవుల్లో ఎక్కువమంది ఉండేం చేస్తారనే వాదన ఉంది.
దీనికి తోడు జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు వేయాలని ప్లీనరీలో తీర్మానం చేశారు. దీంతో నేతలకు భారీగానే ఉపాధి హామీ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నియోజకవర్గ కమిటీలే ప్రధాన పాత్ర పోషించాలని చెబుతున్నారు కేసీఆర్. అక్కడ చూపించే ప్రతిభ ఆధారంగానే భవిష్యత్తులో పదోన్నతులు దక్కుతాయనేది తేల్చిచెబుతున్నారు గులాబీ బాస్.
మరిన్ని వార్తలు: