ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలో వాటిలో గెలవడానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఓటర్ల దృష్టి ఆకర్షించడానికి, ఉన్న పథకాలను మెరుగులు దిద్ధడమో లేక కొత్త పథకాలు ప్రవేశపెట్టడమో చేస్తారు. కానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం చాలా భిన్నమయిన పథకాన్నేప్రవేశపెట్టారు. అయితే అది ప్రజల కోసం కాదు, ప్రజా పార్టీల కోసం.
పూర్తిగా చెప్పాలంటే, తెలంగాణా సి.యం కెసిఆర్ తెలంగాణా ఉన్న అన్ని పార్టీలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణాలో ఉన్న 29 జిల్లాలలో, ఒక్కో జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టుకునేందుకు గాను ఎకరా వరకు భూమిని కేటాయిస్తుంది. అయితే, యార్డ్ కి వంద రూపాయల చొప్పున చెల్లించాలి. అలాగే, కట్టుకున్న పార్టీ ఆఫీస్ కి ఎప్పటికీ ప్రాపర్టీ టాక్స్ ఉండదు. తెరాసా పార్టీ ఆఫీస్ ల పనులకు కూడా సిద్ధపడినట్టు తెలుస్తుంది కానీ, హైదరాబాద్ లో మాత్రం కట్టరని వినికిడి.
ఈ అద్భుతమయిన ఆలోచనా శ్రీకారంకి కారణం ఎవరో తెలియదు గానీ, కెసిఆర్ ఇలా చేయడం తెలంగాణా రాజకీయాలలో కొత్త ఒరవడి సృస్ష్టిస్తుంది. ఇందులో దాగి ఉన్న రహస్యం ఏమిటో, దీని ముందు ముందు ఇంకెన్ని వింతలు చూడాలో అనేది కేవలం ఆ చంద్రశేఖరుడికే తెలియాలి….