తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్ని పిలిచే వారిని స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలికారు. ఇప్పుడు జగన్‌ను ఆహ్వానించేందుకు విజయవాడ వెళుతున్నారు. విమానంలో మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్ విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.30 తర్వాత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు. 2:30 గంటలకు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. అక్కడే ఏపీ సీఎం తెలంగాణా సీఎం కోసం లంచ్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ జగన్ ని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు. తర్వాత రాత్రి 8 గంటలకు కేసీఆర్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.