కంటి వెలుగు మన కంటికి ఆనదా కేసీఆర్ సార్…!

KCR-In-Delhi-For-Eye-Dental

ఈ ఏడాది పంద్రాగస్టు సందర్భంగా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల మందికి కంటివెలుగు ద్వారా ఉచిత కంటి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుందని అప్పట్లో ప్రకటించారు. 828 వైద్య బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లోని డివిజన్లలో శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందిస్తారు. సుమారుగా కంటి సమస్యలతో బాధపడుతున్న 4 లక్షల మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు అని టీఆర్‌ఎస్ శ్రేణులు ఊదర్కొట్టాయి.

cm-kcr
అందుకు తగ్గట్టు గానే పధకం ద్వారా ఉచిత కంటి పరీక్షలు,మందులు,ఉచిత కంటి ఆపరేషన్లు,కళ్ళద్దాలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పధకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియాగం చేసుకున్నారు. పధకంలో భాగంగా అప్పట్లో మంత్రులు సైతం తమ కళ్ళకు పరీక్షలు చేయించుకొని పధకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ మాత్రం కంటి, పంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్‌ తెరాస తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్నారు. ఈ మేరకు వైద్యుల సూచనతో పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

cm-kcr-delhi

అయితే కేసీఆర్‌ కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్ళటంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రజలందరికి వైద్యం చేయటానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నారుగాని మన ముఖ్యమంత్రికి మాత్రం వైద్యం చేయటానికి డాక్టర్లు లేరా? అని ఛలోక్తులు విసురుతున్నారు.మరికొందరైతే కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్తున్నారా లేక రహస్య రాజకీయ పర్యటనా? అని కామెంట్ చేస్తున్నారు. నిజమే మరి లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.

KCR