మళ్ళీ ప్లాన్ మార్చిన కేసీఆర్…ఈసారి ప్లాన్ బీ…!

Two More TRS MPs Likely To Join Congress Party

రెండు నెలల కిందట అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ యాభై రోజుల్లో వంద సభలనే మాట చెప్పి సంచలనం రేపారు. మాట అయితే ఇచ్చేశారు కానీ ఆయన హాజరయిన సభలు మూడే అయ్యాయి. ఇంకా గట్టిగా ప్రచారానికి ఇరవై ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ కేసీఆర్ షెడ్యూల్ ఖరారుకాలేదు. పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై కేసీఆర్‌ రోజువారీగా సమీక్ష జరుపుతున్నారు. రోజుకు కొంతమంది అభ్యర్థులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ప్రచారం సాగుతున్న తీరును ఆరా తీస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అవసరమైనచోట్ల వివిధ ఏజెన్సీల ద్వారా మెరుపు సర్వేలు చేయిస్తున్నారు. వాటి ఆధారంగా సవరించుకోవాల్సిన లోపాలను అభ్యర్థులు, మంత్రులు, ముఖ్య నేతలకు తెలియజేస్తున్నారు.

kcr-speech

2014 లో కేసీఆర్ గెలిచి సీఎం అయ్యాక తెలంగాణలో ఎదురులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అనుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపించారు. అధికారం మళ్ళీ తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారడం మొదలు పెట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కూటమి రూపంలో కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి వచ్చింది. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉంది కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం ఉండేది. కానీ కూటమి బలంతో కాంగ్రెస్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా టీడీపీ కేడర్ బలం కాంగ్రెస్ కి బాగా కలిసొస్తుంది. సర్వేలు కూడా మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నాయి. ఇదే కేసీఆర్ కి మింగుడుపడటం లేదు. దీనికి తోడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న మరో అంశం గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసన.

congress-trs
కేసీఆర్ తాను సర్వేలు చేయించుకున్నానని అన్ని సర్వేల్లో వందకి పైగా సీట్లు వస్తాయని తేలిందని అసెంబ్లీ రద్దు రోజున చెప్పుకొచ్చారు. తమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి కాబట్టి ప్రజలు తెరాస ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని కారు గుర్తు కనిపిస్తే చాలు ఓట్లు గుద్దేస్తారని అనుకున్నారు. అందుకేనేమో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మార్చకుండా దాదాపు వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్సే కొంపముంచింది అనిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేసారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కొందరు నేతలని అయితే అసలు గ్రామాల్లోనే అడుగు పెట్టనివ్వట్లేదు. అభ్యర్థులను మార్చలేక, ఈ అభ్యర్థులతో ఎలా గెలవాలో తెలియక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు.

KCR Is Trying To Assimilate With Sentiment

ఈ నేపధ్యంలో కొన్ని ఏరియాల్లో సభలు, సమావేశాలు బాగా తగ్గించుకోవాలని సూచించారు. ఇదే ప్రాతిపదికన టీఆర్‌ఎస్‌ ప్రచార సభలు ఖరారు కానున్నాయి. ఈ నెల పన్నెండున ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ప్రచారసభలు ప్రారంభమవుతాయి. కూటమి అభ్యర్థులను ప్రకటించాక కేసీఆర్‌ సభలు మొదలు కానున్నాయి. స్వల్ప వ్యవధి మేరకు రోజుకు నాలుగైదు సభల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. పూర్తిగా కేసీఆర్ ప్రచారం హెలికాప్టర్‌ ద్వారానే సాగనుంది. రోజుకు నాలుగైదు సభల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. 24 అసెంబ్లీ స్థానాలున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసీఆర్‌ చివరి మూడు రోజులు ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఎన్ని వ్యూహాలు మార్చినా ఈ దఫా గెలుపు కష్టమనే అభిప్రాయమే ఇంకా వినిపిస్తోంది.

kcr-telengana