Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
KCR Not Given Appointment To Kodandaram
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనో హీరో. అనూహ్యంగా జేఏసీ ఛైర్మన్ గా ఎంపికై.. అన్ని పార్టీలను ఒక్కతాటిపై నడిపారు. జానా లాంటి సీనియర్లను, కేసీఆర్ లాంటి ఉద్యమ కారులను అందరినీ ఒకే మాటపై నడిపించారు. కానీ తెలంగాణ వచ్చాక మాత్రం పనికిరాకుండా పోయారు. అదేమంటే కోదండరాంకు రాజకీయ కాంక్షలు ఎక్కువయ్యాయని కేసీఆర్ అంటారు. కేసీఆర్ సీఎం కావచ్చు కానీ.. కోదండకు కాంక్షలుండకూడదా అని ఆయన సన్నిహితులంటున్నారు.
ఇప్పుడు కోదండ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎన్నిసార్లు అడిగినా ప్రగతి భవన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. దీంతో విసిగిపోయి జిల్లాల టూర్లు చేస్తూ అధికార పక్షానికి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ధర్నాచౌక్ ఉండాలంటూ.. ఢిల్లీలో ఆందోళనకు సిద్ధపడ్డారు. ఓకానొక సమయంలో కోదండకు సాక్షాత్తూ సోనియా నుంచి ఆహ్వానం వచ్చింది. కేసీఆఱ్ తో భేటీ తర్వాత. తెలంగాణ ఇచ్చే ముందు కోదండతోనూ భేటీ అయ్యారు సోనియా.
హస్తినలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కోదండ.. ఇప్పుడు దీనంగా ధర్నా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మడమంటే ఇదేనేమో. ఎలాగైనా సరే కేసీఆర్ ను సాధించాలని కోదండరామ్ కృతనిశ్చయంతో ఉన్నారు. అవసరమైతే ప్రధానిని కూడా కలిసి కేసీఆర్ అప్రజాస్వామిక పోకడలపై కంప్లైంట్ ఇవ్వాలని కసిగా ఉన్నారు. మరి కోదండ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.
మరిన్ని వార్తలు: