Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉద్యమం అయిపోయింది. అనుకున్నది సాధించేశారు. ఇంకా ఆంధ్రావాళ్లపై అక్కసు మాత్రం చావలేదు. అదేమంటే అదే తమ పార్టీ అస్తిత్వమని లోపాయికారీగా చెబుతున్నారట గులాబీ నేతలు. పోచంపాడు సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందని కేసీఆర్ మాట్లాడటం భిన్నాభిప్రాయాలకు తావిచ్చింది.
ఏ ప్రాజెక్టుల్నైనా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాకపోతే నాగార్జున సాగర్ కు మొన్నే స్వర్ణోత్సవాల సందర్భంగా కేసీఆర్ సర్కారే గులాబీ లైట్లు పెట్టి హంగామా చేసింది. కానీ శ్రీరాంసాగర్ ను మాత్రం పట్టించుకోలేదు. ఈ తప్పు కూడా ఆంధ్రా వాళ్ల నెత్తిన రుద్దడం కేసీఆర్ కు అలవాటైపోయింది. కేసీఆర్ సీఎంగా వచ్చి మూడేళ్లైంది. అలాంటప్పుడు శ్రీరాంసాగర్ గేట్లు బాగు చేయించడానికి కూడా టైమ్ లేదా అనే విమర్శ వినిపిస్తోంది.
ప్రాజెక్టుల్లో పూడికతీతా ఏటా జరిగే తంతు. దానికి ఏ ప్రభుత్వమూ బిల్డప్ ఇచ్చి ప్రచారం చేయదు. కానీ కేసీఆర్ రూటే సెపరేటు. అందుకే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీతను కూడా గొప్పగా చెప్పుకుని.. దానికి కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ అంటూ కలర్ ఇచ్చారు. కేసీఆర్ తీరు చూస్తుంటే పబ్లిసిటీకి కాదేదీ అనర్హం అన్న రీతిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను మొగ్గలోనే తుంచేయడానికి.. విపక్షాల ఆందోళనను సైడ్ చేయడానికే కేసీఆర్ పోచంపాడు సభ పెట్టారనే మాట వినిపిస్తోంది.