Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తానో స్వాప్నికుడిగా అభివర్ణించుకునే కేసీఆర్.. తెలంగాణలో అంతా తన ముద్రే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే చాలావరకు ఉన్న పథకాలకే పేర్లు మార్చి జనాన్ని ఏమారుస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సచివాలయం బాగానే ఉన్నా కూడా.. కొత్తది కట్టాల్సిందేనని డిసైడయ్యారు. సచివాలయంతో పాటు అసెంబ్లీ కూడా నిర్మిస్తామని డిసైడయ్యారు.
హైదరాబాద్ లో కొత్త సచివాలయానికి చాలా స్థలాలు పరిశీలించి.. చివరకు బైసన్ పోలో గ్రౌండ్ అనువుగా ఉందని తేల్చారు. అయితే అది కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో.. చాలాసార్లు హస్తిన చుట్టూ తిరిగినా పని కాలేదు. కానీ మొన్నటి ఢిల్లీ టూర్లో కేసీఆర్ ఈ పని సాధించేశారు. దీంతో తుమ్మల అర్జెంట్గా ప్రెస్ మీట్ పెట్టి గ్రౌండ్లో బిల్డింగులు కట్టేస్తామని ప్రకటించారు.
బైసన్ పోలో గ్రౌండ్ ను పరిశీలించిన కాంగ్రెస్.. ప్రాణత్యాగం చేసైనా గ్రౌండ్ కాపాడుకుంటామని భీష్మ ప్రతినలు చేసింది. పైగా కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, ఒంటెత్తు పోకడతో అవసరం లేని పనులు చేస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ అంతంత మాటలనడంతో.. ఇక టీఆర్ఎస్ నేతలు ప్రతివిమర్శలతో చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: