Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
KCR Tensed About Kodandaram
తెలంగాణలో కేసీఆర్ కు ఎదురులేదని అందరూ అంటున్న మాటే. ప్రతిపక్షాలన్నీ నామమాత్రానికి పరిమితమయ్యాయి. కేసీఆర్ వైఫల్యాలున్నా.. వాటిని క్యాష్ చేసుకునే లీడర్ లేకపోవడం ఆయనకు కలిసొస్తోంది. విపక్షాలన్నింటినీ తొక్కేసిన కేసీఆర్.. కోదండరాం విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు. కోదండ విషయంలో కేసీఆర్ ఏం చేసినా రివర్స్ కొడుతోంది.
అమరుల స్ఫూర్తి యాత్ర పేరుతో కోదండరాం చేస్తున్న టూర్లు.. కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్నాయి. అందుకే ఆయన టూర్ ప్రారంభం కాకముందే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు కేసీఆర్. చివరకు విద్యార్థుల్నీ వదలకుండా కేసీఆర్ లాఠీఛార్జ్ చేయించడం చూస్తుంటే.. ఆయన ఎంత భయపడుతున్నారో అర్థం కావడం లేదు. నిజానికి కోదండరాం ఏమీ కేసీఆర్ కు పోటీ రావడం లేదు. అయినా సరే గులాబీ బాస్ ఉలిక్కిపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఓ దశలో దీక్ష విరమించారు. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించడంతో విధిలేక మళ్లీ దీక్ష కంటిన్యూ చేశారు. ఆ సమయంలో కేసీఆర్ కంటే కోదండరాంకే ఎక్కువ క్రేజ్ ఉంది. అలాంటి కోదండరాంతో ఎప్పటికైనా డేంజరేనని గ్రహించిన కేసీఆర్.. చిన్నపామును కూడా పెద్ద కర్రతో కొడుతున్నారు.
మరిన్ని వార్తలు: