‘మహానటి’ చిత్రంతో తెలుగులో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. టాలీవుడ్లో ఈమె సినిమాలు కమిట్ కాలేదు. మహానటి తర్వాత వరుసగా తెలుగులో కాకుండా తమిళంలో నటిస్తుంది. తాజాగా ఈమె విక్రమ్‌తో కలిసి ఒక తమిళ చిత్రాన్ని చేసింది. ఆ చిత్రం తెలుగులో ‘సామి’ అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. విక్రమ్‌కు గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉండేది. కాని ఆమద్య వరుసగా ఫ్లాప్ు రావడంతో ఈయన సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దాంతో ఈయన సినిమాలు ఈమద్య కాంలో విడుదల కావడం లేదు. తాజాగా కీర్తి సురేష్ కారణంగా ఈ చిత్రం విడుదల అవుతుంది.
తెలుగులో భారీ ఎత్తున క్రేజ్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు ‘సామి’ చిత్రంలో నటించడం కారణంగా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. విక్రమ్ సినిమాను నిర్మాతలు రెండు మూడు కోట్లకు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కాని కీర్తి సురేష్ ఉంది అనే ఒకే ఒక్క కారణం వల్ల ఏకంగా 8 కోట్లకు ఈ చిత్రం అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో ఈచిత్రంను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రం బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంను హరి తెరకెక్కించాడు అంటూ సమాచారం అందుతుంది. తెలుగులో హరి తెరకెక్కించిన పలు సినిమాలు డబ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.