మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై ఇండస్ట్రీ ప్రముఖులు మరియు నటీనటులు తిరుగుబాటు చేశారు. మలయాళ హీరోయిన్‌పై లైంగిక వేదింపులకు పాల్పడ్డ నటుడు దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. 80 రోజులకు పైగా జైల్లో ఉన్న దిలీప్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. లైంగిక వేదింపుల కేసులో ఆయన ఇంకా దోషిగానే ఉన్నాడు. ఈ సమయంలో ఆయన్ను మలయాళ తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లోకి తీసుకోవడం జరిగింది. మోహన్‌లాల్ అధ్యక్షుడిగా ఉన్న ఈ సంఘంలోకి దిలీప్‌ను తీసుకు వచ్చేందుకు రాజకీయాలు జరిగాయి. ఆ రాజకీయాలతో దిలీప్ మళ్లీ అమ్మలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి విషయంలో మోహన్‌లాల్‌కు ఎందుకు ఇంత జాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా కేరళ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. ఆ అవార్డులను అందించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంకు ప్రత్యేక అతిథిగా మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్‌లాల్‌ను ఆహ్వానించడం జరిగింది. అయితే మలయాళ నటుడు బిజుతో పాటు మరి కొందరు ఆ కార్యక్రమానికి మోహన్‌లాల్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌లాల్ ఆ కార్యక్రమంలో హాజరు అయితే తాము సదరు కార్యక్రమంను బహిష్కరిస్తాం అంటూ ప్రకటించాడు. ఈ విషయమై కేరళ ప్రభుత్వం చర్చిస్తుంది. సినీ పరిశ్రమ నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మోహన్ లాల్ సదరు కార్యక్రమంలో పాల్గొనక పోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మోహన్‌లాల్ ప్రత్యేక అతిథి అంటూ కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మెల్ల మెల్లగా మోహన్‌లాల్‌పై వ్యతిరేకత తీవ్రతరం అవుతుంది.