ముదురుతున్న కేశినేని – పీవీపీల ట్వీట్స్ యుద్ధం !

kesineni and pvp tweets war

విజయవాడలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మొన్నటి వరకు టీడీపీ నేతలు ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దాల మధ్య మాటల యుద్ధం నడిస్తే ఇప్పుడు సీన్ మారిపోయి వైసీపీ నేత పీవీపీ కేశినేని మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఇద్దరు నేతలు ట్వీట్లతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రబుద్ధుడితో అక్రమ సంబంధమంటూ కేశినాని ట్వీట్ చేస్తే అటు ఇటు కానోళ్లఅంటూ పీవీపీ కూడా రెచ్చిపోయారు. కేశినాని నాని తన ట్వీట్లలో ప్రబుద్ధుడుతో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది. నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు’అన్నారు. నాని అంత ఘాటుగా ట్వీట్ చేస్తే పీవీపీ ఊరుకుంటారా. ఆయన కూడా కౌంటరిచ్చారు.‘ముందు నీది పసుపు నిక్కరో, ఖాకి నిక్కరో తేల్చుకోవయ్యా సామి !! సక్రమ సంబంధమో లేక అక్రమ సంబంధమో ప్రజలే తెలుస్తారు. అటు ఇటు కానోళ్ళని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెపుతారు. చెప్పడం మర్చిపోయాను ప్రతి సారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా,‌ మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమయే ! అసలే కరువు కాలం తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ “గురువు”గారిని అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము’అంటూ ఎద్దేవా చేశారు.

pvp