భర్తకు రోగం…ఆ వంకతో వివాహితపై రేప్…వీడియోలు తీసి !

rape on married woman

భర్త అనారోగ్యం నయం చేస్తానని నమ్మించి వివాహితపై అత్యాచారానికి పాల్పడటమే కాక ఆ తతంగాన్నంతా వీడియో తీసి డబ్బుల కోసం వేధిస్తున్న ఓ మోసగాడిని మహారాష్ట్రలోని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన ఓ మహిళభర్త 2014-18 కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాకపోవడంతో ఆవేదనలో ఉన్న ఆమెకు ఓ వ్యక్తి తాను నయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె నుంచి పెద్దమొత్తంలో డబ్బు, నగలు తీసుకున్న ఆ వ్యక్తి తరుచూ ఇంటికి వస్తూ మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మహిళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ కామాంధుడి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ధైర్యం చేసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వేధింపులకు గురిచేస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసుల విచారణలో నిందితుడు మరో ఇద్దరు మహిళలను రూ.15లక్షలు, రూ.93లక్షల మేర మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.