బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు సీఎంగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అను నేను’ చిత్రంతో కైరా అద్వానీ హీరోయిన్గా పరిచయం కాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్ కైరా అద్వానీ కీలక పాత్రలో కనిపించబోతుంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌కు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొరటాల శివ సినిమాలో మాత్రం హీరోయిన్స్‌కు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందనే విషయం ఆయన గత చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. తెలుగులో కొరటాల శివ గత చిత్రాల్లో జనతాగ్యారేజ్‌లో తప్ప అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు.
తాజాగా ఈ చిత్రంలో కూడా హీరోయిన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని, భరత్ సీఎం అవ్వడంలో, అయిన తర్వాత కీలక పాత్ర పోషించే ఐఏఎస్ పాత్రలో కైరా అద్వానీ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం భరత్‌కు పీఏగా కైరా అద్వానీ కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే తెలుగులో కైరాకు భారీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ‘భరత్ అను నేను’ చిత్రం విడుదల కాకుండానే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశంను దక్కించుకుంది. సినిమా సక్సెస్ అయితే ఆఫర్లకు కొదువ ఉండదేమో అని సినీ వర్గాల వారు అంటున్నారు.