Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస క్షిపణి ప్రయోగాలతో శతృదేశాలను బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరో ప్రమాదకర ఆలోచన చేస్తున్నట్టు జపాన్ భావిస్తోంది. శత్రదేశాలపై ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను ప్రయోగించే అవకాశాన్ని కిమ్ పరిశీలిస్తున్నట్టు జపాన్ పత్రిక అసాహీలో ఒక కథనం వచ్చింది. ఖండాంతర క్షిపణిలకు ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను అమర్చి ప్రయోగించాలన్నది కిమ్ ప్లాన్ అని తెలిపింది. క్షిపణి ప్రయోగం వల్ల వెలువడే ఉష్టానికి ఆంత్రాక్స్ బ్యాక్టీరియా బతుకుతుందా… లేదా అనే అంశాన్ని నిర్దారించుకునేందుకు ఉత్తరకొరియా పరీక్షలు నిర్వహిస్తోందని, ఈ విషయంపై అమెరికా ప్రభుత్వానికి సమాచారం ఉందని కూడా అసాహీ తన కథనంలో ప్రచురించింది.
ఆంత్రాక్స్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. బాసిల్లిస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ బ్యాక్టీరియాను బాంబులు, క్షిపణులు, రాకెట్లు వంటి ఆయుధాలకు జోడించి ప్రయోగించవచ్చు. చైనా దశాబ్దాల కిందటే ఈ ప్రయోగం చేసింది. 1932 నుంచి 1945 మధ్య కాలంలో జరిగిన చైనా జపాన్ యుద్ధంలో మొదటిసారి ఆంత్రాక్స్ ప్రయోగం జరిగింది. ఆంత్రాక్స్ ను ఆయుధాలకు జోడించి చైనా ప్రయోగించింది. ఇప్పుడు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా మిత్రదేశం బాటలో పయనించాలని చూస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాధిలో మూడు దశలుంటాయి. తొలిదశలో రెండు లేదామూడు రోజులపాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో తీవ్ర జ్వరం, ఛాతి నొప్పి, శ్వాసతీసుకోలేకపోవడం, షాక్ కు గురవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. మూడ దశ అత్యంత ప్రమాదకరమైనది. ఈదశకు చేరుకున్న రెండురోజుల్లోనే వ్యాధిగ్రస్థులు మరణిస్తారు.