Posted [relativedate] at [relativetime time_format=”H:i”] +
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజాకీయ ప్రస్థానం 2014 ఎన్నికల తోటే ఆగిపోయింది. రాష్ట్ర విభజనకి ముందు 10 జన్ పథ్ మీద సీఎం గా వుండి మరీ కిరణ్ చేసిన పోరాటం చూసి చాలా చాలా ఫిదా అయ్యారు. ఎప్పటికైనా కిరణ్ కి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని నమ్మారు. జనమే కాదు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే అనుకున్నారు. విభజన టైం లో చేసిన పోరాటంతో వచ్చిన ఇమేజ్ తనకి రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆయన భావించారు. అందుకే 2014 లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కాదని సొంత పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లారు . అయితే విభజన అయిపోయాక సమైక్యాంధ్ర అన్న మాట జనం చెవికి ఎక్కలేదు. అయినా కాస్త వేచి చూస్తే ఏదో ఓ పార్టీ నుంచి పెద్ద పదవి ఆఫర్ వస్తుందని ఆయన అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నట్టు ఏమీ కాలేదు. పార్టీ లోకి అయితే పిలుస్తున్నారు గానీ అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దీంతో ఆయన చూద్దాం అనుకుంటూ ఇప్పటిదాకా గడిపారు. ఇంకో ఒకటిన్నర ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కానీ కిరణ్ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. అన్ని పార్టీల వ్యవహారశైలి చూసిన కిరణ్ చివరకు కాంగ్రెస్ అయితేనే బెటర్ అనుకునే స్థితికి వచ్చారట.
కిరణ్ ఈ ఆలోచన చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కబురు పెట్టిందట. అందుకు ఎన్నో కారణాలు వున్నాయి. విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో నష్టపోతారని కిరణ్ చేసిన హెచ్చరిక నిజమైందని సోనియా, రాహుల్ కూడా ఫీల్ అవుతున్నారంట. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించినా తమని ఏమీ అనలేదన్న సానుకూల అభిప్రాయం కూడా వారిలో ఉండటంతో కిరణ్ మీద దృష్టి పడిందట. దీంతో ఇద్దరికీ ఒకరి అవసరం ఇంకోరికి అర్ధం అయ్యిందట. త్వరలో కిరణ్ తిరిగి సొంతగూటికి చేరుకొని పార్టీ పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
మరిన్ని వార్తలు: