Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ క్షణానికి ఏ రంగు మారుతుందో తెలియని రాజకీయం చేయడం చాలా కష్టం. అయితే రాజకీయం కన్నా ఓ న్యూస్ ఛానల్ నడపడం ఇంకా కష్టమని అర్ధమైందట కోమటిరెడ్డి బ్రదర్స్ కి. రాజ్ న్యూస్ ఛానల్ ని రెండు సంవత్సరాల పాటు లీజ్ కి తీసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కి దాన్ని నడపంలో చుక్కలు కనిపిస్తున్నాయట. కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండటంతో పాటు తమ రాజకీయ భవిష్యత్ కి ఉపయోగపడుతుందని న్యూస్ ఛానల్ వైపు మొగ్గు చూపారు. ఇక కోమటిరెడ్డి వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందన్న నమ్మకంతో పెద్ద ఛానెల్స్ లో పని చేసే చాలా మంది జర్నలిస్టులు ఆ సంస్థలు వదిలేసి రాజ్ లో చేరారు. అయితే అక్కడ పరిస్థితులు అనుకున్నట్టు లేవు. రాజగోపాలరెడ్డి సన్నిహితుడు అని చెప్పుకునే ఓ ఉద్యోగి రాకతో సీన్ మొత్తం మారిపోయింది. ఒక్క సారిగా రాజకీయాలు ఎక్కువై కీలక పదవుల్లోని జర్నలిస్టులు రాజ్ ని వదిలేశారు.
ఇక ఆర్ధికంగా చూసినా నెలకి కోటికి పైగా ఖర్చు అవుతుంటే తిరిగి వస్తోంది 20 లక్షలకి కాస్త అటుఇటుగా ఉందట. ఈ పరిస్థితుల్లో రాజకీయ అవసరాల కోసం ఆర్ధిక నష్టాలు భరించడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్క చేయడం లేదట గానీ ఛానల్ లో సిబ్బంది మధ్య సమన్వయము కుదిర్చి దాన్ని గాడిలో పెట్టడానికి మాత్రం నానా అగచాట్లు పడుతున్నారట. ఇదే విషయం చెబుతూ ఓ సన్నిహితుడితో ఛానల్ నడపడం కన్నా పాలిటిక్స్ ఈజీ అన్నారట కోమటిరెడ్డి బ్రదర్స్.