Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏదైనా చూసే కళ్లని బట్టి ఉంటుందని పెద్దలు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్ధం అవుతోంది. 2014 ఎన్నికల ముందే టీడీపీ నేతలతో గొడవ పెట్టుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రస్తుతం సాక్షి ఛానల్ లో పని చేస్తున్న విషయం తెలిసిందే. ఏ రోటికాడ ఆ పాట పాడడం అంతటి సీనియర్ కి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆ పాటలో భావం కాస్త అయినా అర్ధవంతంగా లేకుండా భజనకే పరిమితం అయితే ఆ పాటకే విలువ లేకుండా పోతుంది. తాజాగా ఆయన టీడీపీ , వైసీపీ మధ్య పోలిక తెస్తూ భిన్నమైన కామెంట్స్ చేశారు.
పార్టీ ఫిరాయింపుల అంశంలో వైసీపీ అధినేత జగన్ పూర్తి ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవంతో వ్యవహరిస్తుంటే చంద్రబాబు లో ఆ రెండు మచ్చుకు కూడా కనిపించడం లేదట. గిడ్డి ఈశ్వరి పార్టీ మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ కొమ్మినేని ఈ కామెంట్స్ చేశారు. ఆయన చెప్పింది నిజమే అనుకుంటే ఈశ్వరి ని పార్టీ మారొద్దని కోరుతూ ఇంతమంది వైసీపీ నేతలు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతారా ? జగన్ సతీమణి భారతి స్వయంగా ఈశ్వరికి ఫోన్ చేస్తారా ? పోలవరం ఆగే పరిస్థితి వచ్చినందుకు చంద్రబాబుని ఓ రేంజ్ లో ఆడుకున్న జగన్ ఒక్కసారి అయినా కేంద్రం , మోడీ పేరు ఎత్తారా? ఎక్కడైనా ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం తో వుండే వ్యక్తి ఎదుటి మనిషిని కూడా గౌరవిస్తారు. కానీ పాదయాత్ర సభల్లో పంది, బొక్క లాంటి పదప్రయోగాలు చేస్తారా ?ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటే జగన్ బీజేపీ ప్రాపకం కోసం ఇంతలా పాకులాడేవారా ? ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా, వైసీపీ భవిష్యత్ ఏంటో జనానికి అర్ధం అయిపోతున్నా కూడా కొమ్మినేని లాంటి వాళ్ళు ఇలాంటి ఉపమానాలు చెప్పడం వల్ల జరిగే నష్టం జగన్ కి మాత్రమే అని వేరే చెప్పాలా ?