కోన మద్యవర్తిత్వం, సైలెంట్‌ అయిన కత్తి… కాని ఇంకా ఉంది

Kona Venkat mediating between Kathi Mahesh and Pawan Kalyan fans

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌, కత్తి మహేష్‌ వివాదం కొన్ని రోజుల పాటు సైలెన్స్‌ అయ్యింది. తాజాగా కత్తి మహేష్‌ పలు సంచలన ఆరోపణలను పవన్‌ కళ్యాణ్‌ గురించి, పూనం కౌర్‌ గురించి చేసిన విషయం తెల్సిందే. ఇద్దరి మద్య ఉన్న సంబంధం ఏంటీ అంటూ కూపీలాగే ప్రయత్నం చేశాడు. అయితే కత్తి భావిస్తున్నట్లుగా అక్కడ ఏమీ లేదని, పవన్‌ మంచి మనస్సును పూనంపై చూపించడం తప్ప మరేం లేదు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ కత్తిపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ సమయంలోనే రచయిత కోన వెంకట్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వివాదం గురించి ఏ ఒక్క ఫ్యాన్‌ కూడా ఈనె 15 వరకు మాట్లాడకుండా ఉండాలి అంటూ సూచించాడు.

ఫ్యాన్స్‌కు ఓపెన్‌గా చెప్పిన కోన వెంకట్‌ రహస్యంగా కత్తి మహేష్‌తో కూడా మాట్లాడి ఈనెల 15 వరకు కాస్త సైలెంట్‌గా ఉండాలని రిక్వెస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కోన రిక్వెస్ట్‌కు స్పందించిన కత్తి మహేష్‌ ఈనెల 15 వరకు తాను పవన్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని, ఫ్యాన్స్‌ తనను ఇబ్బంది పెట్టనంత వరకు ఎలాంటి విమర్శలు చేయబోను అంటూ కత్తి చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వారం రోజులు కత్తి విమర్శలు ఉండకపోవచ్చు. అయితే రేపు అజ్ఞాతవాసి విడుదల కాబోతున్న నేపథ్యంలో కత్తి మహేష్‌ ఇవ్వబోతున్న రివ్యూ ఎలా ఉండబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు కత్తి మహేష్‌ బ్యాడ్‌ రివ్యూ ఇస్తే మళ్లీ వివాదం మొదటికి వచ్చే అవకాశం ఉంది. సినిమా గురించి పాజిటివ్‌గా కత్తి స్పందిస్తే ఫ్యాన్స్‌ కాస్త చల్లబడి 15 తర్వాత కూడా కత్తిని వదిలేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.