కారు దిగడానికి రెడీ అయ్యారట

Konda Surekha To Leave TRS

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా , వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ.. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యేగా విజయం సాధించినా.. అడుగడుగునా గులాబీ ముళ్లు గు్చచుకుంటూనే ఉన్నాయి. తనకు గానీ, తన వర్గానికి గానీ ఎలాంటి గుర్తింపు లేకపోవడం, తన కంటే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోవాలక్ష్మి వంటి వారికి గుర్తింపు దక్కడాన్ని సురేఖ జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీలో చేర్చుకున్న తొలినాళ్లలో కొండా దంపతుల్ని మురిపెంగా చూసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదట. గులాబీ పార్టీలో అందరితో అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండం ఎందుకని, తమను పువ్వుల్లో పెట్టి చూసుకనే కాంగ్రెస్ కు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషాయన్ని కొండా సురేఖ ఖండిస్తున్నారు. రాజకీయ పునర్జన్మ ఇచ్చిన టీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

తన రాజకీయ వారసురాలు కూతురు సుస్మిత పటేల్ అని, వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే విషయంపై చర్చ జరుగుతున్నట్లు చెప్పారు. కానీ అసలుకే దిక్కు లేనప్పుడు వడ్డీ ఏం వస్తుందని కొండా వర్గం గుసగుసలాడుతోంది. సురేఖ చెప్పిన మాట కేసీఆర్ వింటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు సురేఖకే టికెట్ గల్లంతైనా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే సొంత గూడు కాంగ్రెస్ కు సురేఖ వెళ్లక తప్పదేమో.