Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Koratala Shiva Taking 25 Crores
Remunaration For Next Film
హీరోకైనా, దర్శకుడికైనా ఒక్క సూపర్ హిట్ పడితే పారితోషికం అమాంతం పెరిగి పోవాల్సిందే. వారు పెంచకున్నా నిర్మాతలు పెంచి ఇచ్చేందుకు ఎగబడతారు. అయితే హీరోలు మరియు దర్శకులు ఇటీవల కొత్త పద్దతిని ఫాలో అవుతున్నారు. అదే షేరింగ్ విధానం. లాభాల్లో వాటాలు లేదా ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పటి వరకు హీరోలు మరియు కొందరు దర్శకులు కూడా అలా చేశారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ ఈ పద్దతిని ఫాలో అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు. ఎన్టీఆర్‌తో వచ్చే సంవత్సరంలో చేయబోతున్న సినిమాకు మరో పద్దతిలో పారితోషికం తీసుకోవాలని భావిస్తున్నాడు.
ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న కొరటాల శివ తర్వాత సినిమాను మహేష్‌బాబుతో చేయబోతున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో చేసేందుకు కమిట్ అయ్యాడు. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఆ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు కొరటాల శివ పారితోషికంగా సీడెడ్ మరియు వైజాగ్ ఏరియాల రైట్స్‌ను తీసుకోబోతున్నాడు. అలాగే శాటిలైట్ రైట్స్‌లో కూడా సగానికి పైగా కొరటాల శివ తీసుకోవాలని భావిస్తున్నాడు. అందుకు నిర్మాత సుధాకర్ ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రం 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే కొరటాలకు 25 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. ‘జై లవకుశ’ మరియు ఆ తర్వాత చేయబోతున్న త్రివిక్రమ్ సినిమాలు సక్సెస్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ మరింతగా పెగుతుంది. అంటే అప్పుడు 30 కోట్ల కంటే కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు