లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా? ఉండదా?

krish planning about Lakshmi parvathi role on ntr biopic movie

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌లో బాలకృష్ణతో పాటు విద్యాబాలన్‌ మరియు ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సినీ మరియు రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించేందుకు దర్శకుడు స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. ఎన్టీఆర్‌ హీరోగా చేసినప్పుడు ఆయన భార్య బసవతారకం ఉన్నారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించబోతున్నారు.

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొన్నాళ్లకు లక్ష్మీ పార్వతితో పరిచయం అయ్యింది. లక్ష్మి పార్వతి పాత్రను ఎలా చూపిస్తారు అనేది ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌ చిత్రంలో లక్ష్మి పార్వతి పాత్ర లేకుండా ఉంటే అది అసంపూర్తి అన్నట్లుగానే ఉంటుంది. అందుకే లక్ష్మి పార్వతి పాత్రను క్రిష్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణకు లక్ష్మి పార్వతికి అస్సలు పడదు. దాంతో ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో లక్ష్మి పార్వతిని నెగటివ్‌గా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ లక్ష్మి పార్వతిని నెగటివ్‌గా చూపిస్తే ఆమె ఎంత మాత్రం సహించదు. సినిమాపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. పాత్ర తీసేసి చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. కాని సినిమాలో లోటు కనిపిస్తుందని ఆలోచిస్తున్నారు. మొత్తానికి లక్ష్మి పార్వతి పాత్ర ఉంటుందా ఉండదా అంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.