Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మద్య కాలంతో బాలీవుడ్ సినిమాలు చైనాలో భారీ వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్‌తో పాటు పలువురు హీరోలు నటించిన సినిమాలో చైనాలో ఊహించని రీతిలో వసూళ్లు సాధించాయి. అయితే బాహుబలి మాత్రం ఆశించిన రీతిలో అక్కడ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలం అయ్యింది. రెండు పార్ట్లు కూడా అక్కడ ఫ్లాప్‌గానే మిగిలాయి. కారణం ఏంటో కాని బాహుబలిని అక్కడ ప్రేక్షకులు ఆధరించలేదు. కాని క్రిష్ మాత్రం తన సినిమాను ఖచ్చితంగా చైనా ప్రేక్షకులు ఆధరిస్తారని, తన సినిమాకు కనీసం 300 కోట్లు అక్కడ నుండి వస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్సి లక్ష్మిభాయి జీవిత చరిత్రను చూపించబోతున్నాడు. క్రిష్ గత చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో పౌరాణిక కథను బాగా చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా జాన్సి పాత్రను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలో దాదాపు పది బాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇక చైనాలో కూడా ఈసినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాకు తమ సినిమాకు పూర్తి వైవిధ్యం ఉంటుందని, అందుకే బాహుబలి ఫలితం తమ సినిమాకు పునరావృతం అవ్వదని భావిస్తున్నట్లుగా దర్శకుడు సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం కంగనా ఒక హీరో కంటే ఎక్కువగా కష్టపడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.