ఏపీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేశ్, కేటీఆర్‌ల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగింది. భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి ఇటీవల ర్యాంకింగ్స్‌కు విడుదల కాగా… అందులో 98.42%తో ఏపీ ప్రథమ స్థానం, 98.33%తో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. అయితే కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు దూరమైందని అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన నారా లోకేశ్… ‘‘మీకు కూడా అభినందనలు. ఇందులో ఒకటి, రెండు స్థానాలు లేవు. తెలుగు రాష్ట్రాలు రెండూ ఉత్తమ స్థానాల్లో ఉన్నాయి. ఇదంతా తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే’’ అంటూ సమాధానం ఇచ్చారు.