ఏమైంది ఈ కేటీఆర్ కి…ఎంత ముందస్తు ఎన్నికలైతే మాత్రం…మహాకూటమికి అనుకూల పవనాలు వీస్తుంటే మాత్రం…ప్రజల్లో తెరాస నేతలకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంటే మాత్రం…ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటాడని సంపాదించిపెట్టుకున్న పేరుని ఈ కేటీఆర్ ఇలా రీట్వీట్లు చేస్తూ, చెడగొట్టుకుంటుంటే ఎలా?ఒకటా…రెండా…అ ఆ అన్నా…ఒ ఓ అన్నా…తెలంగాణాలో తెరాస కి అనుకూలంగా ఎవరు దగ్గినా…ఏ మూలన తుమ్మినా సరే ట్విట్టర్లో వెతికిపట్టుకొని మరీ రీ-ట్వీట్ చేసే పనిని పెట్టుకున్నాడు కేటీఆర్ (ఏమోలే ఈ ట్విట్టర్ పనిని ఇంకెవరికో అప్పజెప్పుంటాడు ఎన్నికల ప్రమోషన్ కి అని అనుకోవచ్చేమో).
అరే…తెలంగాణాలో తెరాస కి అనుకూలంగా ఎవరైనా పోస్ట్ పెడితే అది కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో రీ-ట్వీటు అవ్వాల్సిందే. ఏ ఆడమనిషో, ముసలవ్వో తెరాస గురించి నాలుగు మంచి మాటలు చెప్పిందో…ఇక అంతే అది రీ-ట్వీటే, తెరాస ఫాలోవర్లు మహాకూటమి కి వ్యతిరేకంగా విమర్శలో, పోస్టులో, మాటలో, చెవాకులు పేలినా సరే అది కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో రీ-ట్వీటుగా చేరాల్సిందే, కేసీఆర్ దేవుడు (ఎలా దేవుడు అయ్యాడో ఏమో), మాకు బువ్వ పెట్టిండు, కరెంటు ఇచ్చిండు (ఎవరి బువ్వ, ఎవరి కరెంటు ఎవరు ఎవరికి ఇచ్చిండు, పుణ్యానికి తన జేబులో నుండి ఇచ్చిండా ఏందో ఈ గోల) అని తెరాస కార్యకర్తలు వీడియోలు తీసి పెట్టిండ్రో చాలు ఇగ అది కూడా కేటీఆర్ దొర ట్విట్టర్ ఖాతా లోకి చేరుడే…ఈయన ట్విట్టర్ పేజీ నిండా ఇవే ముచ్చట్లు. పొరపాటున ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి, ఎప్పుడో కేటీఆర్ ని ఫాలో అయిన పాపానికి వరుసగా తమ ట్విట్టర్ పేజీల నిండా కేటీఆర్ రీ-ట్వీట్ల వర్షం ఏమిట్రా సయామీ అంటూ నెటిజన్లు క్రిందమీద పడుతున్నారు. ఎంత ట్విట్టర్ ఉంటే మాత్రం దాన్ని ఇలా చిన్నచితక ప్రొమోషన్లకు వాడుకుంటే, ఆయన ఫాలోవర్ల సంగతి ఏమికాను…ఏందో ఈ కేటీఆర్ సారూ ముచ్చట అని తెగ ఇదైపోక ఏమి చేసుడు కనపడదాయే.